పౌర నిఘాతోనే నగర సమస్యలు పరిష్కారం: ఓరుగంటి

GNTR: నగరంలో ఎదుర్కొంటున్న తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలకు పరిష్కారం పౌర నిఘాతో సాధ్యమని గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది.