గిట్టుబాటు ధరలు లేకే రైతన్నల ఆత్మహత్యలు: సీపీఐ
ATP: పెద్దవడుగూరు మండలంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సోమవారం చేపట్టారు. సీపీఐ మండల కార్యదర్శి వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పత్తి క్వింటా రూ.12వేలతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.