పిడుగురాళ్లలో రేపు జాబ్ మేళా..!
PLD: పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం గురజాల నియోజకవర్గంలోని యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. ఈ మేళాలో 10 కంపెనీలు పాల్గొంటాయని, నెలకు రూ.13 వేల నుంచి రూ.35 వేల వరకు జీతం ఉంటుందన్నారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతీ, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.