'కార్మికుల మీద కవిత కపట ప్రేమ'

MNCL: సింగరేణిలో అవినీతి గురించి కవిత మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో TBGKS నాయకులు పదేళ్లు సింగరేణిని వంచించి, కార్మికుల రక్తం పీల్చారని ఆరోపించారు. కార్మికుల మీద కపట ప్రేమ చూపించడం శోచనీయం అన్నారు .