తనిఖీల కోసం మరో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం

HYD: నగరం సహా శివారు జిల్లాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ తనిఖీలను మరింత వేగవంతం చేసి, కఠిన చర్యలను తీసుకొని, అమలు చేసే విధంగా ప్రత్యేక మరో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.