ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.!

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.!

అన్నమయ్య: రాయచోటిలోని మదనపల్లి రోడ్డులో గురజాల పాపారావు(48) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతుడిది చిన్నమండెం మండలం దిగువ గొట్టివీడు గ్రామం. మృతునికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు పాపారావు జ్యూస్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.