షాపింగ్ మాల్ నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు

షాపింగ్ మాల్ నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు

SRPT: జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం సమీపంలో అతి త్వరలో ప్రారంభం కానున్న ఒక షాపింగ్ మాల్ వద్ద రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. అయితే మాల్ నిర్వాహకులు తమ ప్రచార కార్యక్రమాలపై చూపుతున్న శ్రద్ధ, వచ్చే వినియోగదారుల భద్రతపై చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.