జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ కింద ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.