రేషన్ దుకాణంలో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ

రేషన్ దుకాణంలో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ

W.G: మొగల్తూరు మండలంలోని కాళీపట్నంలో ఉన్న 40వ నంబర్ చౌకధరల దుకాణాన్ని గురువారం తహసీల్దార్ కె.రాజ్ కిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సరుకులు, స్టాక్ రిజిస్టర్లు, ఆన్‌లైన్ బయోమెట్రిక్ విధానాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలని రేషన్ డీలర్‌కు పలు సూచనలు జారీ చేశారు.