తొలి దళిత సీఎంకు బాపట్ల ఎంపీ నివాళి

బాపట్ల జిల్లా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత సీఎంగా దామోదరం సంజీవయ్య అపార కృషి చేశారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఘన నివాళి అర్పించారు. సంజీవయ్య కృషి భావి తరాలకు ఆదర్శప్రాయమన్నారు. ఆయన అడుగుజాడల్లో దళితుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.