ఆర్టీఐ కమిషనర్ ఇంట్లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

ఆర్టీఐ కమిషనర్ ఇంట్లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలో ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి స్వగృహంలో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, హోమం శబరిమల దేవస్థానం మేలుతాంత్రి బ్రహ్మశ్రీ మనోజ్ తాంత్రిక ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మహా పడిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలో జిల్లా నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.