పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మార్కులు తగ్గడం, స్కూల్‌కు వెళ్లకపోవడం వంటి కారణాలతో తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. NCRB గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తేలింది. 2013-23 మధ్య కాలంలో ఈ సంఖ్య 65% పెరిగింది. 2013లో 8,423 ఉండగా 2023లో 13,892కి చేరింది.