కనకదాసు చిత్రపటానికి కలెక్టర్ నివాళులు

కనకదాసు చిత్రపటానికి కలెక్టర్ నివాళులు

సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో శ్రీ భక్త కనకదాసు జిల్లా స్థాయి జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొని, కనకదాసు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కనకదాసు సేవలను కలెక్టర్ కొనియాడారు.