జాతీయ పశువ్యాధి నియంత్రణ గోడ పత్రికను అవిష్కరణ

ELR: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా ఈనెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి శుక్రవారం ఉంగటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఎమ్మెల్యే ధర్మరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ద్వారా మూగజీవాలకు రక్షణ కల్పించటం జరుగుతుందన్నారు.