శ్రీశైల జలాశయం నీటిమట్టం @882.10 అడుగులు

శ్రీశైల జలాశయం నీటిమట్టం @882.10 అడుగులు

KRNL: శ్రీశైలం జలాశయం నీటిమట్టం 882.10 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 197.2737 టీఎంసీలకు చేరింది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 60,457 క్యూసెక్కుల వరద శ్రీశైల డ్యామ్‌కు చేరుతోంది. ప్రస్తుతం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,152 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.