'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

JGL: భారీగా వర్షాలు కురుస్తున్నందున పెగడపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ రవీందర్ కోరారు. పెగడపల్లి మండలంలోని లింగాపూర్ పెద్ద చెరువుతో పాటు పలు లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. వరదలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్ఐ శ్రీనివాస్ ఉన్నారు.