నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

KMM: దమ్మపేట మండలంలోని మారుమూల కొండరెడ్ల గిరిజన గ్రామం పూసుకుంటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆది నారాయణ, కలెక్టర్ జితేశ్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్లు శనివారం ఉదయం పర్యటించనున్నారు. గవర్నర్ దత్తత గ్రామమైన పూసుకుంటలో కొండరెడ్ల సమస్యలను స్వయంగా పరిశీలించి తెలుసుకోనున్నారు.