'కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి'

'కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి'

BDK: చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. మండల పరిధిలో 14 పంచాయతీల సీనియర్ నాయకులతో కలిసి జరగబోయే పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల గురించి దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వెల్లడించారు.