నిండుకుండలా మారిన పాకాల సరస్సు

నిండుకుండలా మారిన పాకాల సరస్సు

WGL: పర్యటక ప్రాంతమైన పాకాల సరస్సు నిండుకుండలా మారింది. కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు సరస్సులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సరస్సు పూర్తి సామర్థ్యం 30.3 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 29 అడుగులకు చేరుకుంది. మరో అడుగు నీరు వస్తే మత్తడి పారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.