VIDEO: రామాయంపేటలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.!

VIDEO: రామాయంపేటలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.!

MDK: ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరికీ గాయాలైన ఘటన రామాయంపేట మండలంలో జరిగింది. ప్రధాన రహదారిపై మొక్కజొన్న ధాన్యం ఆరబోయడంతో ద్విచక్ర వాహనం ధాన్యం కుప్పను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో భిక్కనూర్ (మం) రామేశ్వరంపల్లి గ్రామం చెందిన లావణ్య, దేవేందర్‌లకు గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.