రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో సిర్పూర్ విద్యార్థినికి బహుమతి
NZB: తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో సిర్పూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని మేదరి మాధురి ప్రోత్సాహక బహుమతి సాధించింది. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వ్యాసాలను రాష్ట్ర స్థాయికి పంపగా, అన్ని జిల్లాల నుంచి వచ్చిన వ్యాసాలలో మాధురి వ్యాసం ఎంపికైందని ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు.