నిజాయితీ చాటుకున్న ఖాజీపేట ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఖాజీపేట ఆటో డ్రైవర్

అన్నమయ్య: ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రవిశంకర్ నిజాయితీ చాటుకున్నారు. శనివారం కడప నగర ఎన్జీవో కాలనీ నుంచి ఒక మహిళ రవిశంకర్ ఆటోలో ఓంశాంతి నగర్ వరకు ప్రయాణించారు. ఈ క్రమంలో మహిళ ఆటోలోనే హ్యాండ్ బాగ్ మరిచిపోగా.. గుర్తించిన ఆటో డ్రైవర్ ఆ బ్యాగును స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు బ్యాగ్‌ని పరిశీలించి సదరు మహిళకు అందజేశారు.