జిల్లా కేంద్రంలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

MBNR: జిల్లా కేంద్రంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న భగీరథ మహర్షి విగ్రహానికి ఎంపీ డీకే అరుణ పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కఠోర తపస్సుతో గంగను భువి నుంచి దివికి తీసుకువచ్చిన గొప్ప తపస్వి భగీరథ మహర్షి అని అన్నారు.