పండగను శాంతియుతంగా చేసుకోవాలి: కలెక్టర్

నాగర్ కర్నూలు: కలెక్టర్ బాదావత్ సంతోష్ శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య పండగను చేసుకోవాలన్నారు. ప్రకృతిని రక్షించాలని అప్పుడే మనం రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందించిన వారమవుతామని తెలిపారు.