జీపీ ఎన్నికల బరిలో 52 మంది సర్పంచ్ అభ్యర్థులు
KMM: ఈనెల 17న సత్తుపల్లి మండలంలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ఊపందుకుంది. 21 జీపీలకు గాను ఇప్పటికే ముగ్గురు సర్పంచ్‌లు, 40 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే, 168 వార్డు స్థానాలకు 402 మంది బరిలో నిలిచారు.