బోల్తా పడిన ఇటుక ట్రాక్టర్

బోల్తా పడిన ఇటుక ట్రాక్టర్

ADB: ఇచ్చోడ మండలం తలమర్రి గ్రామ సమీపంలో ఇటుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. సిరిచెల్మ గ్రామం నుంచి పోన్న ఎక్స్ రోడ్డుకు వెళ్తున్న ట్రాక్టర్ అతివేగంతో బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. ట్రాక్టర్లో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు. ఎవరికి ప్రాణహాని జరగలేదని వెల్లడించారు.