8 నెలల క్రితం పెళ్లి అయింది.. వాగులో మృతదేహం లభ్యం
SDPT: అక్కన్నపేట మండలం మల్లంపల్లి, గొల్లపల్లి గ్రామాల మధ్య దారునూతి వాగులో ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడు మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ (25)గా గుర్తించారు. రామకృష్ణ బైక్‌పై వెళ్తుండగా వాగు ఉద్ధృతిలో కొట్టుకుపోయాడు. 8 నెలల క్రితం రామకృష్ణకు కళావతితో వివాహమైంది. ఆమె మీర్జాపూర్‌లో గిరిజన హాస్టల్లో వార్డెన్‌గా పనిచేస్తుంది.