అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వాము దగ్ధం

కృష్ణా: ఉయ్యూరులో ఈ రోజు మధ్యాహ్నం ఓ రైతు వరిగడ్డి వాము అగ్ని ప్రమాదంలో దగ్ధం అయ్యింది. మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 సచివాలయం సమీపంలో గల వరిగడ్డి వాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పడం మొదలు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపుచేశారు. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.