మరోసారి దాతృత్వాన్ని చాటిన సింహ వాహిని ఫౌండేషన్
SRD: పటాస్ చెరులో ఇటీవల 16 నెలల పసి బాలుడు మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న కుటుంబం కావడంతో, బాలుడి తండ్రి సింహ వాహిని ఫౌండేషన్‌ను ఆశ్రయించారు. దీనికి స్పందించిన ఫౌండేషన్ సభ్యులు తమ వంతుగా విరాళాలు సేకరించి, బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. సేకరించిన నిధులను కూకట్‌పల్లిలోని కుముదిని దేవి హాస్పిటల్‌లో బాలుడి తండ్రికి అందజేశారు.