ఆశ్రమంలో విద్యారణ్య భారతి స్వామి పాద పూజ

ఆశ్రమంలో విద్యారణ్య భారతి స్వామి పాద పూజ

NZB: నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆశ్రమం ఆధ్యాత్మిక శోభతో వెలిగింది. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. భక్తులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పాద పూజ చేశారు. సనాతన ధర్మం, సేవా ప్రాముఖ్యతను ఉపదేశించారు. అనంతరం స్వామివారు భక్తులకు ఆశీర్వాదం ఇచ్చారు.