దొంగతనాలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

దొంగతనాలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

విజయనగరం రైల్వే స్టేషన్‌లో రైల్వే రక్షక దళం తమ సిబ్బందితో ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రైళ్లలో దొంగతనాలు చేస్తున్న కటక్ చెందిన బీషల్‌ను అదుపులోకి తీసుకున్నామని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఈమేరకు అతని వద్ద నుంచి సుమారు రూ.1 లక్ష విలువైన మూడు చరవాణులు స్వాధీనం చేసుకొని, అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం విశాఖ కోర్టుకు తరలించామన్నారు.