ఇది మా అందమైన వైజాగ్: మంత్రి లోకేష్
VSP: విమానంలోంచి ప్రయాణిస్తు వీడియో చేసి Xలో పోస్ట్ చేసిన ఓ అకౌంట్‌కు మంత్రి లోకేష్ రిప్లే ఇచ్చారు. విమానం కిటికీలోంచి హనుమాన్ జీని చూస్తే, అది యాదృచ్చికం కాదని, ఆయన దయ అని ఓ ప్రయాణికురాలు వీడియో తీసింది. అయితే ఆమెకు మంత్రి లోకేష్ 'ఇది మా అందమైన వైజాగ్' అని ట్వీట్ చేశారు. దీంతో విశాఖ నగరంపై ఆయనకు ఎంత మక్కువ ఉందో తెలుస్తుందని పలువురు చెప్పుకొచ్చారు.