రేపు శంకర్ విలాస్ వంతెనకు శంకుస్థాపన

రేపు శంకర్ విలాస్ వంతెనకు శంకుస్థాపన

GNTR: గుంటూరులో శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి బుధవారం ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి కందుల దుర్గేష్, మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి పాల్గొననున్నారు.