ఘనంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు
GNTR: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , నాయకులు భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భక్త కనకదాసు సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించిన మహానుభావుడని వారు గుర్తు చేశారు.