గుంటూరు యువకుడికి బంగారు పతకాలు
GNTR: కజకిస్థాన్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు యువకుడు నేలవల్లి ముఖేష్ సత్తా చాటాడు. జూనియర్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ముఖేష్, 3 టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు, ఒక వ్యక్తిగత కాంస్య పతకం సాధించాడు. అతని అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో మెరుగైన స్థానాన్ని పొందింది. శుక్రవారం పలువురు అతనిని అభినందించారు.