శిథిలావస్థలో పంచాయతీ కార్యాలయ భవనం

KMR: నస్రుల్లాబాద్ మండలం కాంసెట్ పల్లీ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం లోపల పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి, నూతన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి కృషి చేసేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.