ఓం ఆకృతిలో దీపోత్సవం
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కార్తీకమాసం పురస్కరించుకొని నిత్య దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఓం ఆకృతిలో దీపోత్సవం నిర్వహించగా, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కార్తీక మాస విశిష్టతను భక్తులకు తెలియజేశారు.