ప్రమాదవశాత్తు బావిలో పడి రెండేళ్ల బాలుడు మృతి

KNR: రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్ద ఆడుకుంటున్న చీరాల కౌశిక్ నంద(2) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బాలుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.