కోవూరులో రూ.46 లక్షలు అందజేత
NLR: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆమె నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవాళ అందజేశారు. 20వ విడతగా కోవూరు నియోజకవర్గంలో 45 మందికి రూ.37 లక్షలు, పార్లమెంటు పరిధిలో 11 మందికి రూ.9 లక్షలు అందించామన్నారు. ఇప్పటివరకు కోవూరు నియోజకవర్గంలో 553 మందికి రూ.6.50 కోట్లు అందించామని పేర్కొన్నారు.