VIDEO: ప్రైవేటు బస్సు సీజ్
NLR: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ఘటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి వింజమూరులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ సుందరరావు, కరుణాకర్, లక్ష్మీబాయి తనిఖీ చేశారు. ఫైర్ ఎగ్జిట్ సంబంధిత పరికరాలు లేకపోవడంతో ఒక బస్సును సీజ్ చేసినట్లు తెలియజేశారు.