కారు, ఆటో ఢీ.. వ్యక్తికి గాయాలు
ప్రకాశం: తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రోడ్డులో ఆటో, కారు ఢీకొన్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. మార్కాపురం నుంచి వస్తున్న కారు తర్లుపాడు నుంచి వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే స్థానిక వైద్యశాలకు తరలించారు.