పైలట్‌ను నిందించలేదు.. సుప్రీంకు కేంద్రం వెల్లడి
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలో పైలట్‌ను నిందించలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) దర్యాప్తు బృందాన్ని అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ దర్యాప్తు ఒకరిని నిందించటానికి కాదని.. ఇలాంటి తప్పిదం మరోసారి జరగకుండా ఉండేందుకేనని చెప్పింది.