ఏబీఎన్ రాధకృష్ణపై పేర్ని కిట్టు ఫిర్యాదు
కృష్ణా: మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ABN రాధాకృష్ణ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ YCP ఇన్‌చార్జి పేర్ని కిట్టు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలు సహించబోమన్నారు. ప్రభుత్వం, హోం మంత్రి స్పందించాలన్నారు.