ఎంజీయూ కామర్స్ డీన్‌గా ఆకుల రవి

ఎంజీయూ కామర్స్ డీన్‌గా ఆకుల రవి

NLG: మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ డీన్‌గా. ప్రొఫెసర్ ఆకుల రవి నియమితులు అయ్యారు. మంగళవారం ఆయనకు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ అల్వాల రవి ఉత్తర్వులు అందజేశారు. ఇప్పటి వరకు డీన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ యాదగిరి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. వివిధ విభాగాల అధికారులు, సహచర అధ్యాపకులు ఆకుల రవికి అభినందనలు తెలిపారు.