పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న వీధి మార్కెట్లో ఓ వ్యక్తిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.