ఏఎన్ఎం శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
MLG: దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మడికొండ నందు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, నర్సింగ్ కోర్సులలో (ఏఎన్ఎం)శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి పి. జయశ్రీ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఇంటర్ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలని, కులం, స్టడీ సర్టిఫికెట్లతో ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.