'అంగన్వాడీల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి'
GDWL: జిల్లాలో అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గద్వాల, ధరూర్ మండలాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆదివారం సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, పరిసరాల పరిశుభ్రత విషయంలో అశ్రద్ధ వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.