VIDEO: జీ.టీ. రోడ్డులో వెల్లివిరిసిన క్రికెట్ మ్యాచ్ సందడి
శ్రీకాకుళం నగరంలో జీ.టీ. రోడ్డులో ఆదివారం రాత్రి ఇండియా-న్యూజిలాండ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందడి నెలకొంది. ఓ షాపింగ్ మాల్ పెద్ద ఎల్.ఈ.డీ. స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్ టెలికాస్ట్ చూసేందుకు వీలు కల్పించడంతో జీ.టీ. రోడ్డు జన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఫలితంగా ట్రాఫిక్‌కు కొంత ఇబ్బంది ఏర్పడినా, జనం ఉత్సాహం, ఆనందం, అరుపులతో రోడ్డంతా దద్దరిల్లింది.