నాలుగు లారీలు ఢీ.. తప్పిన ప్రమాదం

నాలుగు లారీలు ఢీ.. తప్పిన ప్రమాదం

NLR: కోవూరు హైవే ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న మూడు లారీలను వెనకే వచ్చిన మరో కంటైనర్‌ ఢీకొట్టింది. ఢీకొట్టిన లారీ చెన్నై నుంచి విజయవాడకు వెళ్తుండగా లారీ కింద ఉండే పట్టీలు తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.