వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్

వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కుడి చేతి బొటన వేలికి తగిలిన గాయం కారణంగా జట్టుకు దూరమవుతున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో ఆర్చర్‌కు ప్రత్యామ్నాయంగా లూక్ వుడ్‌ను ఎంపిక చేసింది.